UCO Bank jobs: డిగ్రీ అర్హతతో UCO Bank లో 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 85,920
కోల్‌కతాలోని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO Bank), ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం... డైరెక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు-ఖాళీలు..
* లోకల్ బ్యాంకు ఆపీసర్: 250
రాష్ట్రాల వారీగా..
1. గుజరాత్: 57
2. మహారాష్ట్ర: 70
3. అస్సాం: 30
4. కర్ణాటక: 35
5. త్రిపుర: 13
6. సిక్కిం: 06
7. నాగాలాండ్: 05
8. మేఘాలయ: 04
9. కేరళ: 15
10. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: 10
11. జమ్మూ-కశ్మీర్: 05
మొత్తం ఖాళీల సంఖ్య: 250
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పనిచేసే రాష్ట్రాల్లో స్థానిక భాష వచ్చి ఉండాలి.
విద్యార్హత :
ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి. అభ్యర్థి అప్లై చేసే రాష్ట్ర స్థానిక భాష వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
01-01-2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.48,480-రూ.85,920.
పని ప్రదేశాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, కేరళ, జమ్మూ-కశ్మీర్.
దరఖాస్తు ఫీజు: రూ.850 + జీఎస్టీ;
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175+ జీఎస్టీ.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు :
తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ / సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేట పట్టణాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2025.