RRC ECR Apprentice Recruitment 2025:-
టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 1,154
అర్హత:
➧ కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
➧ ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ట్రేడ్‌లు:
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డీజిల్), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వయోపరిమితి:
➧ అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➧ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 25, 2025
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 14, 2025
ఎలా దరఖాస్తు చేయాలి
RRC ECR అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం మీ దరఖాస్తును సమర్పించడానికి ఈ దశలను అనుసరించండి:
➧ RRC తూర్పు మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.rrcecr.gov.in .
➧ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి.
➧ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలను పూరించండి మరియు స్కాన్ చేసిన ఫోటో మరియు సంతకంతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
➧ దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
➧ దరఖాస్తును సమీక్షించి సమర్పించండి. భవిష్యత్ సూచన కోసం సమర్పించిన అప్లికేషన్ యొక్క ప్రింటౌట్ తీసుకోండి.