ONGC Recruitment 2025 for 108 Vacancies, Apply Online Telugu - AP JOB ALERTS



ONGC Recruitment 2025 :

ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) జాతీయ స్థాయిలో జియోలజిస్ట్ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల కోసం మొత్తం 108 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది ప్రభుత్వ రంగంలోని ప్రముఖ సంస్థలో పని చేయాలనుకునే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. 


ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌ అండ్‌ జియోసైన్స్‌) - 108 ఖాళీలు

విభాగాలు- ఖాళీలు:

1. జియోలాజిస్ట్‌- 05

2. జియోఫిసిస్ట్‌ (సర్ఫేస్‌)- 03

3. జియోఫిసిస్ట్‌ (వెల్స్‌)- 02

4. ఏఈఈ (ప్రొడక్షన్‌ మెకానికల్‌/ ప్రొడక్షన్‌ పెట్రోలియం/ ప్రొడక్షన్‌ కెమికల్‌/ డ్రిల్లింగ్‌ మెకానికల్‌/ డ్రిల్లింగ్‌ పెట్రోలియం/ మెకానికల్‌): 98

మొత్తం ఖాళీల సంఖ్య: 108


అర్హత: పోస్టును అనుసరించి సంబంధించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎంఎస్సీ/ ఎంటెక్‌, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: జియోలాజిస్ట్‌, జియోఫిసిస్ట్‌ జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు 27 ఏళ్లు; ఏఈఈ పోస్టులకు 26 ఏళ్లు. ఓబీసీ వారికి మూడేళ్లు; ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు; పీడబ్ల్యూబీడీ వారికి 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.


స్టైపెండ్: నెలకు రూ.60,000 - రూ.1,80,000.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష కేంద్రాలు: దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌/ గాంధీనగర్‌, గువహటి, ఉదయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, బెంగళూరు, రాయ్‌పుర్‌, లఖ్‌నవూ, భువనేశ్వర్‌, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, జైపుర్‌, మోహలి, భోపాల్‌, ఎర్నాకులం, సూరత్‌, విశాఖపట్నం. 


ఆన్‌లైన్‌ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు: 

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ వారికి రూ.1000; 

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.


ముఖ్య తేదీలు...

 ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 10.01.2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 24.01.2025.

పరీక్ష తేదీ: 23-02-2025.


Post a Comment

0 Comments