NALCO Recruitment 2024: Notification Out for 518 Posts Telugu - AP Job alerts



 NALCO NonExecutive Recruitment :-

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)... నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఖాళీల వివరాలు:

1) లాబరేటరీ డిపార్ట్మెంట్ 37 పోస్టులు 

డిగ్రీ (Hons) కెమిస్త్రీ పాస్ అయ్యి ఉండాలి.


2) ఆపరేటర్ 226 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


3) ఫిట్టర్ 73 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు ఫిట్టర్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


4) ఎలెక్ట్రికల్ 63 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు ఎలెక్ట్రికల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


5) ఇన్స్ట్రుమెంటేషన్ & మెకానిక్ 48 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


6) జియాలజిస్ట్ 4 పోస్టులు : 

Bsc (Hons) జియాలజి పాస్ అయ్యి ఉండవలెను.


7) HEMM ఆపరేటర్ 9 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు డీజిల్ మెకానిక్ & డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి & అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


8) మైనింగ్ 1 పోస్ట్ : 

డిప్లొమా లో మైనింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.


9) మైనింగ్ మేట్ 15 పోస్టులు : 

10th మరియు మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి.


10) మోటార్ మెకానిక్ 22 పోస్టులు : 

10th+ITI పాస్ మరియు మోటార్ మెకానిక్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.


11) డ్రెస్స్ర్ & ఫస్ట్ Aider 5 పోస్టులు : 

 10th పాస్ అయ్యి ఉండాలి.


12) లాబరేటరీ technician Gr-3 (2) పోస్టు : 

ఇంటర్ పాస్ మరియు హాస్పిటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.


13) నర్స్ గ్రేడ్-3 (7) పోస్టులు : 

ఇంటర్ పాస్ మరియు సంబంధించిన ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.


14) ఫార్మసిస్ట్ గ్రేడ్ పోస్ట్ : 

ఇంటర్ పాస్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.


మొత్తం పోస్టుల సంఖ్య: 518.

అర్హత: 

పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విబాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 

21-01-2025 నాటికి డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్/ ల్యాబొరేటరీ టెక్నీషియన్/ నర్సు/ ఫార్మసిస్ట్ పోస్టులకు 35 ఏళ్లు; ఎస్‌యూపీటీ(ఎస్‌ఓటీ)- మైనింగ్ పోస్టులకు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.


దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఉంది.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31-12-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-01-2025.


ముఖ్యాంశాలు:

 నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)- నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

 అర్హులైన అభ్యర్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share