HPCL Junior Executive Recruitment 2025 :
భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 234
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 130
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 65
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 37
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్): 2
విద్యార్హతలు:
మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులు. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయో పరిమితి:
➧ 14.02.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
➧ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
➧ యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➧ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జీతభత్యాలు:
ప్రొబేషన్- ఎంపికైన అభ్యర్థులు చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారు కంపెనీ నియమాల ప్రకారం ఆఫీసర్ గా నిర్ణయించబడతారు. పే స్కేల్ రూ.30వేల నుండి రూ.1,20,000 మధ్య ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT),
గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్,
స్కిల్ టెస్ట్,
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 15, 2025
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2025
HPCL జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దిగువ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించిన తర్వాత మీరు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Step 1: అధికారిక వెబ్‌సైట్ www.hindustanpetroleum.com ని సందర్శించండి
Step 2: హోమ్‌పేజీలో HPCL రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: ఇప్పుడు సంబంధిత లింక్‌కి అవసరమైన వివరాలను అందించండి.
Step 4: దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
Step 5: దయచేసి భవిష్యత్తు సూచన కోసం అదే ప్రింట్‌అవుట్‌ని ఉంచండి.