coal india limited 434 management trainee jobs Telugu - AP Job Alerts



CIL Recruitment 2025 : 

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్ వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


మొత్తం ఖాళీల సంఖ్య : 

కోల్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 


విద్యార్హత : 

వివిధ విభాగాల్లో పోస్టులను అనుసరించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.


జీతం : 

ప్రారంభంలో 50,000/- నుండి 1,60,000/- పేస్కేల్ ఉంటుంది. 

ఒక సంవత్సరం తర్వాత నుండి 60,000/- నుండి 1,80,000/- పే స్కేల్ ఉంటుంది. 

జీతంతో పాటు ఇతర సదుపాయాలు మరియు బెనిఫిట్స్ వర్తిస్తాయి.


వయస్సు : 

30-09-2024 నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.


వయసులో సడలింపు :

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

PWD అభ్యర్థులకు అదనంగా మరో 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.


ఎంపిక విధానం :

 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఎంపిక చేస్తారు.

 ఇంటర్వ్యూ ఉండదు.


పరీక్ష విధానం : 

- పరీక్షలో పేపర్ -1 మరియు పేపర్ -2 ఉంటాయి.

 ప్రతి పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు. 

 పేపర్-1 లో జనరల్ నాలెడ్జ్ లేదా ఎవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు ఇస్తారు. 

పేపర్-2 లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

నెగిటివ్ మార్కులు లేవు. 

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.


అప్లికేషన్ ఫీజు :

➥  SC , ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. 

➥ మిగతావారు జీఎస్టీ తో కలిపి మొత్తం 1180/- ఫీజు చెల్లించాలి.


అప్లై విధానము : 

- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

- అప్లై చేసే సమయంలో అభ్యర్థులు అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. 

- అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. 

- కాబట్టి అప్లై చేసేటప్పుడే అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.


అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

➥ ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 15-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.


అప్లికేషన్ చివరి తేదీ : 

➥ ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అప్లై చేయుటకు చివరి తేదీ 14/02/2025 


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share