GAIL Recruitment 2024 : న్యూఢిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య : 216
- సీనియర్ ఇంజినీర్ (రెన్యూవబుల్ ఎనర్జీ) పోస్టులు : 06
- సీనియర్ ఇంజినీర్ (బాయిలర్ ఆపరేషన్స్) పోస్టులు : 03
- సీనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు : 30
- సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు : 06
- సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు : 01
- సీనియర్ ఇంజనీర్ (కెమికల్) పోస్టులు : 36
- సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్- టీసీ/టీఎం) పోస్టులు : 05
- సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) పోస్టులు : 20
- సీనియర్ ఆఫీసర్ (సీ అండ్ పీ) పోస్టులు : 22
- సీనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు : 11
- సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులు : 22
- సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులు : 36
- సీనియర్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్) పోస్టులు : 23
- సీనియర్ ఆఫీసర్ (లా) పోస్టులు : 02
- సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) పోస్టులు : 01
- సీనియర్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులు : 04
- ఆఫీసర్ (ల్యాబొరేటరీ)పోస్టులు : 16
- ఆఫీసర్ (సెక్యూరిటీ) పోస్టులు : 04
- ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులు : 13
అర్హత:
పోస్టులను అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి:
◘ సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్)/ ఆఫీసర్ (ల్యాబొరేటరీ) పోస్టులకు 32 ఏళ్లు..
◘ ఆఫీసర్ (సెక్యూరిటీ) పోస్టులకు 45 ఏళ్లు..
◘ ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులకు 35 ఏళ్లు..
◘ ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
◘ ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్:
◘ నెలకు సీనియర్ ఇంజినీర్/ సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000..
◘ ఆఫీసర్ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
◘ గ్రూప్ డిస్కషన్,
◘ ఫిజికల్ ఫిటెనెస్ టెస్ట్,
◘ స్కిల్ టెస్ట్,
◘ ఇంటర్వ్యూ,
◘ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
◘ రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లు రిజిస్ట్రేషన్లు ప్రారంభ తేది: నవంబర్ 12, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2024