Ap Ration Dealer Jobs 2024 : ఏపీలో 192 రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. - AP JOB ALERTS




AP Ration Dealers Recruitment 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజ‌న్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.  ఈ నోటిఫికేష‌న్ కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తి పాస్ అభ్య‌ర్థులు అప్లై చేసుకోవ‌చ్చు. 


ఏపీ రేషన్‌ డీలర్స్‌ రిక్రూట్‌మెంట్‌ 2024

  • చీరాల‌, రేప‌ల్లె రెవెన్యూ డివిజ‌న్లలో నియామకం
  • మొత్తం 192 ఖాళీల భర్తీకి ప్రకటన
  • నవంబర్‌ 28 దరఖాస్తులకు చివరితేది


ఖాళీ వివరాలు

రేపల్లె రెవెన్యూ డివిజన్ :

మొత్తం పోస్టులు : 49

46 సాధారణ పోస్ట్‌లు మరియు 3 బైపాస్ (విభజించబడిన) దుకాణాలు ఉన్నాయి .

మండలాల వారీగా ఖాళీలు:

రేపల్లెపట్నం: 8

నాగారం: 8

చుండూరు: 8

చెరుకుపల్లి : 6

నిజాంపట్నం: 5

భట్టిప్రోలు : 5

అమర్తలూరు: 3

కొల్లూరు: 3

వేమూరు: 3


చీరాల రెవెన్యూ డివిజన్ :

మొత్తం పోస్టులు : 143

10 మండలాల్లో 139 రెగ్యులర్ పోస్టులు మరియు 4 కొత్త షాపులు ఉన్నాయి .


విద్యార్హతలివే :

  • ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా అర్హ‌త‌గా నిర్ణ‌యించారు.
  • అభ్యర్థులు రేషన్ దుకాణం ఉన్న అదే గ్రామానికి చెందినవారై ఉండాలి.
  • వీరికి ఎలాంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు.
  • చ‌దువుకుంటున్నవారు, విద్యావాలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న‌వారు, ఆశ కార్య‌క్త‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అన‌ర్హులు. 
  • వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం:

  • రేప‌ల్లె, చీరాల రెవెన్యూ డివిజ‌న్ల‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఆర్డీవో కార్యాల‌యాల్లో స‌మ‌ర్పించాలి.
  • న‌వంబ‌ర్ 28వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తును సమర్పించాలి. 
  • ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికెట్లు జ‌త చేయాల్సి ఉంటుంది. 
  • ఇత‌ర వివ‌రాల కోసం రేప‌ల్లె, చీరాల‌ ఆర్డీవో కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ఇవే:

●︎ 10వ తరగతి, ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణ‌త స‌ర్టిపికెట్లు

●︎  వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

●︎  నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

●︎  మూడు పాస్‌పోట్ సైజ్ పోటోలు

●︎  కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

●︎  నిరుద్యోగిగా ఉన్న‌ట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

●︎  దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికెట్లు జ‌త చేయాలి.


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 28, 2024

దరఖాస్తుల పరిశీలన : నవంబర్‌ 29, 2024

అర్హుల జాబితా ప్రకటన : నవంబర్‌ 29, 2024

ఎంపికైన వారికి రాతపరీక్ష : డిసెంబర్‌ 2, 2024

రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు : డిసెంబర్‌ 3, 2024

అర్హ‌త సాధించిన వారికి ఇంటర్వ్యూల నిర్వహణ : డిసెంబర్‌ 5, 2024

తుది జాబితా వెల్లడి: డిసెంబర్‌ 6, 2024


ఎలా దరఖాస్తు చేయాలి

●︎ దరఖాస్తులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో (చీరాల లేదా రేపల్లె) స్వయంగా సమర్పించాలి .

●︎ అన్ని సంబంధిత ధృవపత్రాలు మరియు పత్రాలు దరఖాస్తు ఫారమ్‌తో జతచేయబడిందని నిర్ధారించుకోండి.

●︎ మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు సంప్రదించవచ్చు:


ఆర్డీఓ నేలపు రామలక్ష్మి (రేపల్లె)

ఆర్డీఓ పి.చంద్రశేఖర్ నాయుడు (చీరాల)

ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉండటానికి, నవంబర్ 28, 2024 లోపు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకోండి!


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share