SBIF Asha Scholarship Program 2024 :-
విద్యార్థులకు గుడ్ న్యూస్. 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు చేయూతనివ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండే షన్ ఇచ్చే SBI ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 ప్రకటన విడుదలైంది.
ఎవరు అర్హులు ?
- ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ నకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అప్లై చేసుకునే వారు ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 మధ్యలో ఉండాలి.
- షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలు (ST) వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- గత అకడమిక్ ఇయర్ లో కనీసం 75శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదు.
- ఇందులో 50శాతం స్లాట్ లు ఫీమేల్స్ కు కేటాయిస్తారు.
ఎంత ఇస్తారు ?
- ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 15వేల స్కాలర్ షిప్ లభిస్తుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు:
- గత అకడమిక్ ఇయర్ మార్క్ షీట్
- గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ (ఆధార్)
- ప్రస్తుత ఏడాది ఎడ్యుకేషన్ ఫీజ్ రిసిప్ట్
- ప్రస్తుతం అడ్మిషన్ ప్రూఫ్
- బ్యాంకు అకౌంట్ వివరాలు(పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులది)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- పాస్ ఫొటో
- కుల ధ్రువీకరణ పత్రం
ఎంపిక విధానం :-
అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
చివరితేదీ : అక్టోబర్ 1
అక్టోబర్ 1లోపు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి అందించే స్కాలర్ షిప్ ప్రోగ్రామ్.
దరఖాస్తు: ఆన్లైన్లో ( online )
Website: https://www.sbifashascholarship.org/